News March 16, 2025

మాజీ MLA రాజయ్య హౌస్ అరెస్ట్

image

సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ పర్యటన సందర్భంగా మాజీ MLA తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సామాన్య ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. దమ్ముంటే అక్రమ అరెస్టులు చేయకుండా జిల్లాలో పర్యటించాలన్నారు.

Similar News

News March 17, 2025

ఒకే రోజు 46 వివాహాలకు హాజరైన ఎర్రబెల్లి

image

ఓకే రోజు 46 వివాహాలకు హాజరై ఎర్రబెల్లి దయాకర్ రావు రికార్డు సృష్టించారు. సాధారణంగా నాయకులు అంటే ఒకటి, రెండు వివాహాలకు హాజరవుతారు కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఒక్క రోజే దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, వర్ధన్నపేట మండలాల్లో పర్యటించి 46 నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు సంతోషకరమైన వైవాహిక జీవితం కోరుతూ వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్నారు.

News March 17, 2025

HYD: స్వశక్తితో బతకడంతో ఆత్మ గౌరవం పెరుగుతుంది: డీజీపీ

image

వివక్ష లేని సమాజం మహిళల హక్కు, సమానత్వమే మనం వారికి ఇచ్చే గౌరవమని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి భాగస్వామ్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వశక్తితో బతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుందన్నారు.

News March 17, 2025

అంబాజీపేట: కళల్లోనే కాదు..చదువుల్లోనూ ఆణిముత్యాలే

image

జడ్పీ హైస్కూల్ తొండవరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సాంస్కృతిక కళల్లో విశేషంగా రాణిస్తున్నారు. విద్యాశాఖ నిర్వహించే కార్యక్రమాల్లో వీరుచేసే నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. వీరికి క్రాఫ్ట్ టీచర్ శ్రీమతి పెయ్యల రాజేశ్వరి చక్కని తర్ఫీదునిస్తుండగా సోషల్ టీచర్ గంటి శ్రీనివాస్ సహకరిస్తున్నారు. చదువులో కూడా చక్కగా రాణిస్తున్న వీరు మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.

error: Content is protected !!