News August 14, 2024
మాజీ MLA వల్లభనేని వంశీకి ఊరట

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈనెల 20 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
Similar News
News November 22, 2025
ఇంద్రకీలాద్రిపై గురు భవానీల పేరుతో దందా..!

ఇంద్రకీలాద్రిపై వచ్చేనెల 11-15వ తేదీ వరకు భవాని మాల విరమణకు భక్తులు రానున్నారు. కాగా ఇప్పటినుంచే ఆలయాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవాలని గురుస్వాముల ముసుగులో కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా మాలవిరమణ సమయంలో వీరిదందా ఎక్కువగా ఉంటోంది. మాల విరమణ, ఇరుముడి తీసేహక్కు లేకున్నా ఆ ఇరుముడిలో వచ్చే నగదుకై 5 రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కట్టడి చేయాలని భవానీలు కోరుతున్నారు.
News November 22, 2025
రేపు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.
News November 22, 2025
కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.


