News September 5, 2024
మాజీ MLA సత్యనారాయణ రాజు కన్నుమూత
నరసాపురం మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) గురువారం మధ్యాహ్నం భీమవరం పట్టణంలో కన్నుమూశారు. 1967 లో సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి పరకాల శేషావతారంపై 4305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు సీపీఎం లోనే ఉన్నారు. ఆయన స్వగ్రామమైన యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Similar News
News September 9, 2024
ప్రత్యేకాధికారులకు ఏలూరు కలెక్టర్ ఆదేశాలు
వరద ముప్పు ముగిసే వరకు అధికారులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఆదివారం ఆమె అధికారులతో మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాలలో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు. అలాగే వరద ప్రమాదం తగ్గేవరకూ మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
News September 9, 2024
ప.గో, ఏలూరు జిల్లాల్లో రేపటి ‘మీకోసం’ ప్రోగ్రాం రద్దు
ప.గో, ఏలూరు జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు నాగరాణి, వెట్రిసెల్వి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాములను కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
News September 8, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు
ఉమ్మడి ప.గో జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పాఠశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. SHARE IT..