News December 13, 2025

మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

image

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్‌ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.

Similar News

News March 1, 2026

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.7.56లక్షలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in

News March 1, 2026

చామంతి నాటడానికి అనువైన సమయం ఏది?

image

చామంతి పంటను జులై నుంచి ఆగస్టు వెల మొదటి వారం వరకు నాటుకోవచ్చు. ఈ సమయంలో నాటితే నవంబర్-డిసెంబర్ నెలల్లో పూల దిగుబడి వస్తుంది. పండుగలు, మార్కెట్‌కు తగినట్లుగా దిగుబడి రావడానికి మొక్కలను జులై నెల మధ్యలో ఒకసారి, జులై నెల చివరి నుంచి ఆగస్టు నెల మధ్య వరకు 15 నుంచి 20 రోజుల తేడాతో రెండో దఫాగా నాటుకుంటే నవంబర్ నుంచి జనవరి వరకు వరుసగా పూలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

News March 1, 2026

దుబాయ్ వెళ్లేవారికి ఇదో గుణపాఠం: BJP ఎంపీ

image

<<19268112>>దుబాయ్‌పై<<>> ఇరాన్ దాడుల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇండియన్ పాస్‌పోర్టును వదిలేసి దుబాయ్ వెళ్లేవారికి ఇదో గుణపాఠం. ఇక్కడ మోదీ ఉండటంతో సురక్షితంగా ఉన్నాం. సోషల్ మీడియాలో పెద్ద పోస్టులు పెట్టడం సులభం’ అని పేర్కొన్నారు.