News February 2, 2025
మాడుగుల: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి

మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో అతిగా మద్యం తాగిన జి.మోహన్‌రావు (48) మృతి చెందాడు. మూడు రోజుల కిందటి నుంచి మోహన్ రావు ఎవరికీ కనిపించలేదు. ఇంట్లో ఉంటాడని భావించిన బంధువులు శనివారం డోర్ తీయగా మృతి చెంది కనిపించాడు. మాడుగుల పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు భార్య, కుమార్తె వద్దకు వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 27, 2025
రబ్బరు సాగు.. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల దిగుబడి

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలో రబ్బరు సాగు ఎక్కువ. APలోని కొన్నిప్రాంతాల్లో రైతులు రబ్బరును సాగు చేస్తున్నారు. పంట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 40 ఏళ్ల పాటు దిగుబడి, ఆదాయం వస్తుంది. ఈ పంటకు ఉష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే దిగుబడి బాగుంటుంది. ఈ మొక్క పెరగాలంటే దాదాపు రోజుకు 6గంటల సూర్యకాంతి అవసరం ఉంటుంది.
News November 27, 2025
స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

ఆన్లైన్ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
News November 27, 2025
కాకినాడ: వారిని చూసి జగన్ నేర్చుకోవాలి.. యనమల

అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూసి ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలో జగన్ చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చిన్నపిల్లలయినా బహిష్కరణలకు తావు కాకుండా సభలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారన్నారు. ఎప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం చేయాలని సూచించారు.


