News November 7, 2024
మాడుగుల: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి !
కన్న కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన మాడుగుల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుడిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు కొడుకులు. వారంతా HYDలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దసరాకు సొంతూరికి వచ్చిన వారు 13న మద్యం మైకంలో గొడవపడ్డారు. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకు సురేశ్‌ను తండ్రి నరికి చంపి పొలంలో పాతిపెట్టారు. నేడు మాడుగుల పోలీసులకు నిందితులు లొంగిపోవడంతో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 6, 2024
MBNR: నియామక పత్రాలు అందజేయండి !
TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News December 6, 2024
వనపర్తి: నేడు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళా ప్రదర్శనలు: కలెక్టర్
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మెగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కళాకారుడు డప్పుల నాగరాజు సారథ్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News December 5, 2024
ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సహచర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.