News December 28, 2024

మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: జస్టీస్ ఎన్వి రమణ

image

సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతామని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం శనివారం డైక్ మన్ హాల్లో సంఘం డైరెక్టర్ జివిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ పాల్గొని మాట్లాడుతూ మనలోని భావాలను మాతృభాష ద్వారా వ్యక్తపరిస్తే అందులో కనిపించే భావోద్వేగం సరైన క్రమంలో చెప్పగలుగుతామన్నారు.

Similar News

News January 4, 2025

పల్నాడు జిల్లాలో ఎయిర్ పోర్టుపై CM కీలక ప్రకటన

image

పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నాగార్జున సాగర్‌లో 1670 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

News January 4, 2025

నేడు గుంటూరులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

గుంటూరు పాతబస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రదర్శనకు తీసుకు రావాలని కోరారు.

News January 3, 2025

APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదు: మంత్రి

image

APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును NTR వైద్య సేవ ట్రస్ట్‌ భరిస్తుందన్నారు.