News January 10, 2025
మాతృ శిశు మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

మాతృ శిశు మరణాలు సంభవిస్తే, సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. గత 5 నెలల్లో జిల్లాలో జరిగిన మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఎంపీసీడీఎస్సార్ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. మొత్తం 10 మాతృ మరణాలు, 6 శిశు మరణాలపై కేసుల వారీగా వివరాలను తెలుసుకున్నారు. మరణాలకు కారణాలు, వారికి అందించిన చికిత్స, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు.
Similar News
News December 1, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 1, 2025
VZM: ‘ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి పెరగాలి’

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS వినతులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్షించారు. ఫిర్యాదుదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆడిట్ అధికారులందరూ PGRSకు విధిగా హాజరుకావాలన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించి మ్యూటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News December 1, 2025
విజయనగరం: ‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని జిల్లా జడ్జి ఎం.బబిత న్యాయమూర్తులకు సూచించారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటి వాటిని ఇరు పార్టీల అనుమతితో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు.


