News February 12, 2025
మాత శిశు మరణాల నివారణపై సమీక్ష

శ్రీ సత్యసాయి జిల్లాలో మాత శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజా బేగం సమీక్ష నిర్వహించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జనవరి -2025 నెలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. గర్భవతులకు సంబంధించి ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
Similar News
News December 5, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News December 5, 2025
ప్రజలు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.
News December 5, 2025
జిల్లాలో 1,748 పాఠశాలల్లో మెగా PTM: DEO

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,19,396 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.


