News March 20, 2025
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు: ఎస్పీ

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని ఆయన అన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయ దారులు యువతనే లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని అన్నారు.
Similar News
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
News March 31, 2025
గొల్లప్రోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వీక్లి స్పెషల్ రైలు నుంచి విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన అనిల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు రైలులోని వాష్ బేసిన్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. సంఘటన ప్రాంతానికి తుని రైల్వే పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.