News August 12, 2024
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం: కలెక్టర్
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి అని, యువతపై వాటి ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Similar News
News October 8, 2024
కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం
కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.
News October 8, 2024
శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ
ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
News October 8, 2024
10న YCP శ్రీకాకుళం జిల్లాధ్యక్షుడిగా ధర్మాన ప్రమాణస్వీకారం
నరసన్నపేట YCP కార్యాలయంలో ఈ నెల 10న పార్టీ జిల్లాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్స్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీపీ మురళి తెలిపారు. నరసన్నపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.