News July 26, 2024
మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత ప్రచారం చేయండి: ఎస్పీ సతీశ్
గుంటూరు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలకు యువత బానిస కాకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చెడు అలవాట్లు వల్ల యువత భవిష్యత్ పాడు చేసుకోకుండా ఆటో ద్వారా విస్తృతంగా పబ్లిక్ అనౌన్సింగ్ సిస్టం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
Similar News
News December 13, 2024
పిడుగురాళ్ల: Love Failureతో సూసైడ్
పిడుగురాళ్ల మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నూర్జిత్ కుమార్ (20) కుటుంబ సభ్యులతో పిడుగురాళ్ల మండలం కామేపల్లికి వరి మిషన్‌తో పాటు వచ్చారు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఓ యువతిని ప్రేమించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ప్రేమ విఫలం కావడంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 13, 2024
బైక్ కొనలేదని తాళాలు మింగిన యువకుడు
గుంటూరు జీజీజీహెచ్ లో ఓ యువకుడి కడుపులో నుంచి వైద్యులు నాలుగు <<14859523>>తాళాలు బయటకు తీసిన సంగతి తెలిసిందే<<>>. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతోనే యువకుడు తాళాలు మింగినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన దేవర భవానీప్రసాద్(28) బండి కొనిపెట్టలేదని మనస్తాపంతో తాళాలు మింగేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకురావడంతో సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ విధానంలో డాక్టర్లు తాళాలను బయటకు తీశారు
News December 13, 2024
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి
అమరావతి: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.