News June 26, 2024
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్ నారాయణ రెడ్డి

నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Similar News
News February 23, 2026
సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.
News February 23, 2026
నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.
News February 23, 2026
NLG: ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు వెనకడుగు..!

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు శాపంగా మారాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో 3,300 ఇళ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం రూ.5 లక్షల సాయం సరిపోక, బేస్‌మెంట్ ఖర్చులకే లక్షలు అవుతుండటంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


