News August 13, 2025

‘మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మెదక్‌ను చేయాలి’

image

మెదక్‌ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జమల నాయక్, సీడీపీఓ హేమ భార్గవి ఉన్నారు.

Similar News

News March 13, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

image

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

News March 13, 2026

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధి: కలెక్టర్

image

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత, పెన్షన్లు, ఉపాధి హామీ, పాఠశాలల పర్యవేక్షణపై అధికారులు సూచనలు ఇచ్చారు.

News March 12, 2026

మెదక్: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 9848214166 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పట్టుదల, క్రమశిక్షణతో చదివి మెదక్ జిల్లాను పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఇందుకోసం మొత్తం 68 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.