News February 10, 2025

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి: నెల్లూరు ఎస్పీ

image

యువకులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల సమాజంలో గౌరవం పోతుందన్నారుతల్లిదండ్రులు కూడా నిరంతరం తమ బిడ్డలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు తెలపాలని సూచించారు.

Similar News

News November 19, 2025

ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

image

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.

News November 19, 2025

కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

image

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 19, 2025

నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.