News September 18, 2024

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

image

గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వర్చువల్ నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు మిషన్‌ పరివర్తన్‌లో భాగంగా గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.

Similar News

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.

News October 3, 2024

KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

News October 3, 2024

ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.