News February 20, 2025

మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘాను పెంచండి: కలెక్టర్ 

image

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబందిత శాఖలు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కువుగా 18 నుంచి 24 వయస్సు వారు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

Similar News

News November 23, 2025

గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

2025–26 సీజన్‌కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్‌లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.

News November 23, 2025

GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

image

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

నేడు గుంటూరులో బాబా శ‌త జ‌యంతి: కలెక్టర్

image

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జ‌యంతిని రాష్ట్ర‌స్థాయి పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ స‌త్య‌సాయి సేవా స‌మితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.