News February 20, 2025
మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘాను పెంచండి: కలెక్టర్

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబందిత శాఖలు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కువుగా 18 నుంచి 24 వయస్సు వారు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
Similar News
News March 18, 2025
ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.
News March 18, 2025
రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
News March 18, 2025
తెనాలిలో ఎన్నారై కుటుంబంలో విషాదం

అమెరికా నార్త్ కరోలినాలో తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తుఫాను కారణంగా భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారులు మృతి చెందారు.