News December 5, 2024
మాదాపూర్‌లో నేడు గవర్నర్, సీఎం పర్యటన

మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నేడు ప్రారంభించనున్నారు. 106 షాపులు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సందర్శకులకు, స్టాల్ నిర్వాహకులకు, తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News December 15, 2025
HYDలో సీక్రెట్‌గా ‘హుష్-డేటింగ్’

HYDలో ప్రస్తుతం ‘హుష్-డేటింగ్’ అనే కొత్త సీక్రెట్ ట్రెండ్ మామూలుగా లేదు. పేరెంట్స్ నిఘా, ఒత్తిడి ఎక్కువైపోవడంతో ఇక్కడి యువతీ యువకులు ఆన్లైన్ డేటింగ్ కోసం గోప్యంగా ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా గ్రూప్ చాట్స్‌లో మాత్రమే గుసగుసలాడుకుంటున్నారు. వీళ్లు కలిసే చోట్ల కూడా ఒక లెక్క ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్ పబ్లిక్ కాఫీ షాప్‌ల వంటి దూరం ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.
News December 15, 2025
HYD: ఇందిరా గాంధీలో మరో కోణం ఈ బుక్

ఇందిరా గాంధీని రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాక, ప్రకృతితో ఆత్మీయ బంధం కలిగిన వ్యక్తిత్వంగా ఆవిష్కరించిన నవల ‘ఇందిరా గాంధీ: ఒక ప్రకృతి ప్రేమికురాలి జీవితం’. అధికార శిఖరంపై ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను రచయిత సజీవంగా చిత్రించారు. రాజకీయ జీవితం- ప్రకృతి ప్రేమ మధ్య సమతౌల్యాన్ని చూపిన ఈ నవల జీవన విలువలను గుర్తుచేసే గొప్ప రచనగా నిలుస్తుంది.
News December 15, 2025
HYD: అనుమతులు మేమిస్తాం.. కాదు మేమిస్తాం

GHMCలో ORR లోపలి ప్రాంతాలు విలీనం అనంతరం అనుమతుల లొల్లి ప్రారంభమైంది. GHMC, HMDA సంస్థలు అనుమతులు మేమిస్తామంటే.. మేమిస్తామని సర్కారుకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇంతవరకు హైరైజ్ అపార్టుమెంట్లు, కొత్త లే అవుట్ల అనుమతులన్నీ HMDA ఇచ్చేది. ఇపుడు ఆయా ప్రాంతాలన్నీ గ్రేటర్లో విలీనం కావడంతో పర్మిషన్స్ ఎవరిస్తారనే విషయం చర్చనీయాంశమైంది. విలీనంతో హెచ్ఎండీఏ ఆదాయం భారీగా కోల్పోనుంది.


