News December 5, 2024

మాదాపూర్‌లో నేడు గవర్నర్, సీఎం పర్యటన

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నేడు ప్రారంభించనున్నారు. 106 షాపులు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సందర్శకులకు, స్టాల్ నిర్వాహకులకు, తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. 

Similar News

News January 23, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @240

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం ఉప్పరపల్లిలో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత నిన్న తగ్గి ఇవాళ కాస్త పెరిగింది.

News January 23, 2026

HYDలో ఇదో అంతుచిక్కని మొక్క!

image

గ్రేటర్ పరిధి చెరువులు, కుంటల్లో గుర్రపు డెక్క అంతుచిక్కని సమస్యగా మారింది. గత 12 ఏళ్లుగా ఎన్నో పైలట్ ప్రాజెక్టులు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినా ఫలితం లేదు. ఉప్పల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గుర్రపు డెక్కను పూర్తిగా చంపేందుకు అంతర్జాతీయ నిపుణులతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా ఫలితం రాలేదు. చెరువుల్లో అతిపెద్ద సమస్యగా మారిన గుర్రపుడెక్కను అంతంచేసే పరిష్కారమే లేదా? అని అడుగుతున్నారు.

News January 23, 2026

SEC: మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

image

సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల రద్దీని దృష్యా SCR 28 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు JAN 28 నుంచి FEB 1 వరకు SEC, NZB, ADB, KMM నుంచి వరంగల్, కాజీపేటకు నడవనున్నాయి.
రూట్లు: SEC- మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్- WGL, కాజీపేట- ఖమ్మం, ఆదిలాబాద్- కాజీపేట మధ్య
స్టాపులు: మౌలాలి, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్ వంటి కీలక స్టేషన్లు
టైమింగ్: ఉ.5:45 నుంచి అర్ధరాత్రి వరకు