News August 29, 2024

మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

image

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.

Similar News

News November 22, 2025

HYD: నేడు కార్గో వస్తువుల వేలం

image

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో పెండింగ్‌లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.

News November 22, 2025

HYD: KPHB‌‌లో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

image

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్‌పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్‌తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.

News November 22, 2025

HYD: బీసీ కమిషన్‌ రిపోర్ట్‌కు కేబినెట్‌ ఆమోదం

image

తెలంగాణలో బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్‌ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్‌ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.