News June 24, 2024
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం: భట్టి
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి జూపల్లితో కలిసి మాట్లాడారు. ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News November 12, 2024
ఖమ్మం: గ్రూప్-3 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలు సిద్ధం
ఖమ్మం జిల్లాలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ సూచించారు. 27,984 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు, ప్రశ్నాపత్రాలు భద్రతతో కేంద్రాలకు చేరవేసి, ప్రతి 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించామన్నారు. సిబ్బందికి పరీక్షల పట్ల పూర్తి అవగాహనను కల్పించారు.
News November 12, 2024
ఖమ్మం: సొంత నివాసాలు లేని మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.
News November 12, 2024
ఖమ్మం మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రామసహాయం రాధికను ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ నియమించారు. కైకొండాయిగూడెంకు చెందిన రామసహాయం నిర్మల, బుచ్చిరెడ్డి కూతురు రాధిక. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె చేసిన సేవాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.