News January 22, 2025
మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే ‘వేముల’

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.
Similar News
News October 27, 2025
NLG: ఆగ మేఘాలతో ఆధార్ అనుసంధానం..!

జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఔట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆధార్ అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయకుండానే.. రికార్డుల్లో చూపే వారికి అందే వేతనాలు నిలిచిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
News October 27, 2025
NLG: అదృష్టవంతులు ఎవరో..!

నల్గొండ జిల్లాలో వైన్స్ టెండరుదారుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. ఎంతో మంది ఆశావహులు వైన్స్ టెండర్లు దక్కించుకోవాలని ఆశతో ఉన్నప్పటికీ వారి కల నెరవేరుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. ఈసారి జిల్లాలో 154 దుకాణాలు ఉండగా.. 4,906 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు ఫీజును పెంచడంతో కొందరు గ్రూపులు జతకట్టి దరఖాస్తు చేసుకున్నారు.
News October 27, 2025
NLG: నకిలీ స్వీట్ల దందా.. తింటే అంతే సంగతి!

నల్గొండలో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన, పురుగులు పట్టిన ముడి పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడానికి హానికరమైన రసాయనాలను కలుపుతున్నట్లు ఇటీవల అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి మిఠాయిలు తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


