News September 20, 2024

మానవత్వం చాటుకున్న ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేఫథ్యంలో జిల్లా SP దామోదర్ బందోబస్తు నిమిత్తం వెళుతున్న క్రమంలో.. ఒంగోలులోని ఉడ్ కంప్లెక్ వద్ద నెల్లూరు జిల్లా జలదంకు చెందిన బ్రహ్మయ్య మూర్ఛ వచ్చి పడిపోయాడు. విషయం గమనించిన ఎస్పీ తనవాహనం ఆపి అతని చేతిలో తాళాలు పెట్టి, సృహ తెప్పించి అనంతరం మంచి నీళ్లు తాగించి అక్కడినుంచి వెళ్లారు. మంచి మనస్సు చాటుకున్న SPని పలువురు అభినందించారు.

Similar News

News December 19, 2025

ఒంగోలు: రైతులారా ఈ నంబర్స్ సేవ్ చేసుకోండి..!

image

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సాగుతున్న నేపథ్యంలో రైతుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూము నంబర్ 8008901457ను సంప్రదించాలన్నారు. వాట్సాప్ నంబర్ 7337359375కు మెసేజ్ చేయాలని జేసీ సూచించారు.

News December 19, 2025

అనాథలను సొంత పిల్లలుగా భావించాలి: ప్రకాశం JC

image

తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు JC గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. అనాథలైన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు సమకూర్చాలన్నారు. 18ఏళ్లు దాటిన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు.

News December 19, 2025

వెనుకబడిన ప్రకాశం జిల్లా

image

సీఎం చంద్రబాబు వివిధ ర్యాంకులు ప్రకటించగా మన జిల్లా చాలా వాటిలో వెనుకబడింది. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు 6మున్సిపాల్టీల్లో రూ.71.19 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా రూ.37.11 కోట్లే వసూళ్లు చేశారు. దీంతో రాష్ట్రంలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది. నీటి పన్ను రూ.27.10 కోట్లు కాగా రూ.3.64కోట్ల వసూళ్లతో 22వ ర్యాంకు లభించింది. గ్రామీణ ఇళ్లు, స్థలాల స్వామిత్ర సర్వేలో మాత్రం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.