News February 17, 2025

మానవత్వం చాటుకున్న హరీశ్ రావు

image

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదుకున్నారు. ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించారు. సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి, మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని, చికిత్స అందించాలని హరీశ్ రావు ఆదేశించారు.

Similar News

News December 14, 2025

15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

image

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.

News December 14, 2025

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ శాతం ఎంతంటే?

image

జిల్లా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు భూపాలపల్లి మండలంలో 27.38%, చిట్యాలలో 27.04%, పలిమెలలో 28.40%, టేకుమట్లలో 23.88% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1కి ముగియనుండడంతో, ఓటర్లు త్వరగా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

News December 14, 2025

మెదక్: SUPER.. PHOTO OF THE DAY

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రామాయంపేట పరిధి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఓ తండ్రి అంగవైకల్యం కలిగిన తన కూతురిని పోలింగ్ కేంద్రం వద్దకు భుజాలపై మోసుకొచ్చి ఓటర్ చైతన్యాన్ని చాటుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఫొటో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
SHARE IT