News January 26, 2025

మానవపాడు: నేడు ఆ గ్రామంలోనే పథకాల ప్రారంభం

image

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న నాలుగు పథకాలను మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు మానవపాడు ఎంపీడీఓ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు మధ్యాహ్నం 1 గంటలకు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.

Similar News

News November 2, 2025

పాలమూరు: చెప్పుల కోసం పోతే.. ఊపిరి పోయింది!

image

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లికి చెందిన మల్కేడి శంకర్‌జీ (45) ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. శనివారం ఆయన బైక్‌పై దాసర్లపల్లి నుంచి మామిళ్లపల్లికి వెళ్తుండగా, చిలుకల వాగు వంతెన దాటే క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, తన పాదరక్షలు నీటిలో కొట్టుకుపోవడంతో, వాటిని తీసే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు.

News November 2, 2025

NRPT: బాల రక్షణ భవనంలో డ్రైవర్ ఉద్యోగం

image

నారాయణపేట జిల్లా పరిధిలోని బాల రక్షణ భవనం వాహనం నడుపుటకు ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం సర్టిఫికెట్ తదితర పత్రాలతో ఈ నెల 7 లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News November 2, 2025

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.