News January 5, 2025

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం

image

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.

Similar News

News January 22, 2025

భూపాల్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నా: KTR

image

భూపాల్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు KTR చెప్పారు. ‘పేరుకే ప్రజా పాలన. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయింది. బీఆర్ఎస్‌కు భయపడి నల్గొండ మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదు. ఫ్లెక్సీలను చింపేసి ఏకంగా మాజీ ఎమ్మెల్యేనే బూతులు తిడుతూ కోమటిరెడ్డి గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇది కాంగ్రెస్ అరాచక పాలన ‘ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

News January 22, 2025

NLG: సంక్రాంతి ఎఫెక్ట్.. డిపోలకు భారీ ఆదాయం

image

నల్గొండ రీజియన్ డిపోలను సంక్రాంతి పండుగ లాభాల బాట పట్టించింది. NLG, DVK, KDD, MLG, SRPT, గుట్ట, నార్కెట్ పల్లి డిపోల పరిధిలో 995 ప్రత్యేక బస్సులు నడపగా రూ.2.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ సందర్భంగా 32 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. అత్యధికంగా సూర్యాపేటలో రూ.74,62,545 ఆదాయం రాగా, తక్కువగా నార్కెట్ పల్లిలో రూ.17,91,455 వచ్చింది.

News January 21, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. నల్గొండ జిల్లా వాసి మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్ట్ మృతి చెందారు. చండూరు మం. పుల్లెంలకు చెందిన పాక హన్మంతు మరణించినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. నల్గొండలోని ABVP నాయకుడు శ్రీనివాస్ హత్యలో హనుమంతు నిందితుడుగా ఉన్నాడు.