News March 31, 2025
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 26, 2025
ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

HYDలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.
News October 26, 2025
ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్లో బిజీ

జూబ్లీహిల్స్లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.
News October 26, 2025
ఓటర్ల జాబితా పకడ్బందీగా పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీసీ ద్వారా సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్. జాబితా పూర్తి, 2002–2025 మధ్య కొత్త ఓటర్ల వివరాలను బూత్ స్థాయిలో ధృవీకరించాలని కలెక్టర్ను ఆదేశించారు. బూత్ అధికారులు BL0 యాప్ ద్వారా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.


