News January 25, 2025
మామిడికుదురు: టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నం

మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్లో పట్టపగలు టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నించిన సంఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టామని నగరం ఎస్సై చైతన్యకుమార్ శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన భూమిలో పాతిన టెలికం వైర్లను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు గోతులు తవ్వుతున్న మహిళలను పోలీసులకు అప్పగించారు. గతంలో ఇదే తరహాలో చోరీ చేశారన్నారు.
Similar News
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు.
News November 21, 2025
ADB: రైతులందరికీ జోగురామన్న కృతజ్ఞతలు

ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ మాజీ మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆఖిలపక్ష రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <


