News March 28, 2025
మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 27, 2025
అనకాపల్లి: మొంథా తుఫానుపై ప్రత్యేక అధికారి ఆరా

మొంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సైక్లోన్ ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పర్యటించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తీర గ్రామాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక కావాలని ఆదేశించారు.
News October 27, 2025
భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.
News October 27, 2025
భారీ వానలు.. మినుములో తెగుళ్ల నివారణ

భారీ వర్షాలకు మినుము పంటకు పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వేరుకుళ్లు, కోరినోస్పోరా ఆకు మచ్చ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 5SC 2 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 25EC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో మారుకా కాయ తొలుచు పురుగు నివారణకు వర్షాలు తగ్గిన వారం రోజులకు క్లోరిఫైరిఫాస్ 25EC 2.5 మి.లీ లేదా నోవాల్యూరాన్ 45 SC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


