News March 11, 2025
మామిళ్లపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జాతర.. ఉచిత బస్సు సదుపాయం

ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు (జాతర) మార్చి 11 నుంచి 16 వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అచ్చంపేట ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థాన కమిటీ కోరింది.
Similar News
News November 23, 2025
వనపర్తి: శిక్షకులు లేక విద్యార్థుల ఇబ్బందులు

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నా.. శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో శిక్షకులు అందుబాటులో లేరు. దీంతో చాలామంది విద్యార్థులు ఆసక్తి ఉన్నా క్రీడలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శిక్షకులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.


