News March 11, 2025
మామిళ్లపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జాతర.. ఉచిత బస్సు సదుపాయం

ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు (జాతర) మార్చి 11 నుంచి 16 వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అచ్చంపేట ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థాన కమిటీ కోరింది.
Similar News
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 14, 2026
నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News January 14, 2026
కామారెడ్డి: పండుగ పూట భగ్గుమన్న చికెన్ ధరలు

సంక్రాంతి వేళ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పండుగ డిమాండ్‌కు తోడు కోళ్ల దాణా ధరలు పెరగడంతో విక్రయదారులు ధరలను సవరించారు. బుధవారం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.310 చేరగా.. లైవ్ కోడి కిలో రూ.200 చొప్పున విక్రయించారు. చికెన్ ధరలు సామాన్యుడికి భారంగా మారగా, మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మార్కెట్‌లో కిలో మటన్ రూ.800 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.


