News October 30, 2024

మామునూర్: వ్యభిచారం ముఠా అరెస్ట్

image

మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధి హనుమాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్‌, విటుడుని టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ.. ఎవరైనా ఆర్గనైజ్‌డ్‌గా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 30, 2024

నర్సంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన నాయకులు

image

నర్సంపేట మండలంలోని ఆకుల తండాలో నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు నానబోయిన చరణ్ రూ.60,000, బానోత్ మాన్సింగ్ రూ, 25,000లకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు రాము, కూకట్ల  శ్రీనివాస్, శ్రీశైలం, సంపత్ తదితరులు ఉన్నారు.

News October 30, 2024

WGL: డా.గుండాల మదన్‌కు అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ అవార్డు

image

వరంగల్ జిల్లాకు చెందిన డా.గుండాల మదన్ కుమార్ భారతరత్న Dr.APJ అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ అవార్డు అందుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మెగాసిటీ నవకళావేదిక, మదర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గత 30 ఏళ్లుగా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న కృషికి ప్రతిఫలంగా ఈ అవార్డు ఇచ్చినట్లు వారు తెలిపారు.

News October 30, 2024

వర్ధన్నపేట: భార్య కాపురానికి రావటం లేదని వాటర్‌ట్యాంక్ ఎక్కిన భర్త

image

వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో మిషన్ భగీరథ ట్యాంక్‌పై ఎక్కి దూకుతానని యువకుడి హల్‌చల్ చేశాడు. భార్య కాపురానికి రావటంలేదని మనస్తాపానికి గురైన భూక్య గణేశ్ (30) ఈరోజు ఉదయం వాటర్ ట్యాంక్‌ ఎక్కి భార్య కాపురానికి రావాలని డిమాండ్ చేశాడు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గతంలో ఉరేసుకోవడానికి ప్రయత్నించగా కుటుంబీకులు గుర్తించి తప్పించారు.