News October 30, 2024
మామునూర్: వ్యభిచారం ముఠా అరెస్ట్
మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధి హనుమాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్, విటుడుని టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ.. ఎవరైనా ఆర్గనైజ్‌డ్‌గా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 4, 2024
వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పునఃప్రారంభం కానుంది. వరుసగా 4 రోజుల సెలవులు (గురువారం దీపావళి, శుక్రవారం అమావాస్య, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో) మార్కెట్ బంద్ అయింది. దీంతో సోమవారం నుంచి మార్కెట్ పున:ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.
News November 3, 2024
పదో తరగతికి స్టడీ అవర్స్ నిర్వహించాలి: DEO
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, అన్ని యాజమాన్యాల పాఠశాలలు జనవరి 10 వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని DEO జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4:15 గంటల నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులను హెచ్ఎంలు పర్యవేక్షించాలన్నారు. అనంతరం జనవరి 11 నుంచి మార్చి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు.
News November 3, 2024
నేడు మడికొండకు సీఎం రేవంత్ రెడ్డి రాక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మడికొండకు రానున్నారు. ఉదయం 10:15 నిమిషాలకు హనుమకొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం మడికొండలో ఓ గార్డెన్‌లో ఉ.10.25 నిమిషాలకు జంగా రాఘవరెడ్డి కూతురు వివాహానికి హాజరవుతారని అన్నారు. అనంతరం 11:45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు.