News May 10, 2024
మాయ మాటలు నమ్మి మోసపోవద్దు: కొండా సురేఖ

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే ఎంపీలను అమ్ముకుంటారని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, శాఖ మంత్రి, కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ విమర్శించారు. సిద్దిపేటలోని ఎన్సాన్ పల్లి, పుల్లూరు, నారాయణరావు పేట గ్రామాల్లో కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను ప్రజలు గద్దె దింపినా కూడా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారని అన్నారు.
Similar News
News December 22, 2025
మెదక్: నేడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు జరగక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. సుమారు రూ.50 కోట్లకుపైగా నిధులు రానుండటంతో పల్లె పాలన మళ్లీ గాడిలో పడనుంది.
News December 22, 2025
చిన్న శంకరంపేట: తాత హయాంలో నిర్మాణం.. మనుమడి హయాంలో హంగులు

చిన్నశంకరంపేట జీపీ సర్వంగ సుందరంగా ముస్తాబయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ తాత కంజర్ల శంకరప్ప రెండవసారి సర్పంచ్ గా పదవీలో కొనసాగుతున్నప్పుడు 01 నవంబర్ 1977 నాటికి గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టారు. ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కోదాటి రాజమల్లు ప్రారంభోత్సవం చేశారు. తాత నిర్మాణం చేపట్టిన జీపీలో మనుమడు పదవి చేపట్టడం కొసమెరుపు.
News December 22, 2025
మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.


