News March 3, 2025
మారథాన్లో సిద్దిపేట కానిస్టేబుల్ సత్తా

కామారెడ్డి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్లో సిద్దిపేట కానిస్టేబుల్ అశోక్ సత్తా చాటాడు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 300 మంది పాల్గొన్న మారథాన్లో అశోక్ 21 కిలోమీటర్లను 1 గంట 40 నిమిషాల్లో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 19, 2025
నేటి సామెత: ఉత్తగొడ్డుకు అరుపులు మెండు

ఈ సామెతలో ఉత్తగొడ్డు అంటే పాలివ్వని, పాలు లేని ఆవు (గొడ్డు ఆవు) అని అర్థం. పాలు ఇచ్చే ఆవు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ పాలు లేని గొడ్డు ఆవు తరచుగా అరుస్తుంటుంది. అలాగే నిజమైన సామర్థ్యం గల వ్యక్తులు తమ పని తాము చేసుకుపోతారని.. పనికిరాని, పనితీరు సరిగాలేని అసమర్థులే ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పలు చెప్పుకుంటారని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 19, 2025
మోడల్ స్కూళ్లలో 5వ తరగతికి ఎంట్రన్స్ పరీక్ష!

TG: మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలుండగా, వాటిని 5వ క్లాస్ నుంచే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాల్లో 5వ క్లాస్ నుంచే క్లాసులు నడుస్తుండటంతో మోడల్ స్కూళ్లలోనూ ఆ విధానాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఆలస్యమైతే ఎప్పటిలాగే 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది.
News December 19, 2025
నంద్యాల జిల్లాకు చెందిన IAS అధికారికి కీలక బాధ్యతలు

అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్గా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన సీనియర్ IAS అధికారి గంధం చంద్రుడును నియమించింది. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు.


