News March 4, 2025
మారనున్న గండికోట రూపురేఖలు

కడప జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో గండికోట ఒకటి. ఇప్పటికే గండికోట అభివృద్దికి రూ.77.0 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. త్వరలో రూ.2500 కోట్ల వ్యయంతో ఇక్కడ 40 ఎకరాల్లో రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క అభివృద్ది పనులు, మరోవైపు ఈ రిసార్టులు పూర్తయినట్లయితే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో గండికోట పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోందని పలువురు అంటున్నారు.
Similar News
News March 16, 2025
WPL ఫైనల్: రెండు వికెట్లు తీసిన కడప జిల్లా అమ్మాయి

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL) ఫైనల్ శనివారం జరిగింది. ఈ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ తలపడగా ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో మన కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఆర్డీపీపీకి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి డిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ముందుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 4 బంతులకు 3 పరుగులు చేసింది.
News March 16, 2025
కడప: ‘డిగ్రీ కాలేజీల్లో ఒంటిపూట తరగతులు పెట్టాలి’

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఒంటిపూట తరగతులకు అనుమతించాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం (జీసీటీఏ), ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం (జీసీజీటీఏ) నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంటిపూట తరగతులు నిర్వహణకు అనుమతించాలన్నారు. నాయకులు శశికాంత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుందరేశ్వర్ పాల్గొన్నారు.
News March 14, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.