News April 24, 2024
మారిన హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థి
హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థిగా వి నాగరాజు స్థానంలో మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లాను ఆ పార్టీ ప్రకటించింది. అటు ధర్మవరం- అశ్వర్ధ నారాయణ, కళ్యాణదుర్గం-రాం భూపాల్ రెడ్డిని తాజాగా ఖరారుచేసింది. కాగా హిందుపురం కూటమి అభ్యర్థిగా బాలకృష్ణ, వైసీపీ-దీపిక బరిలో ఉన్నారు. ధర్మవరంలో కూటమి-సత్యకుమార్ యాదవ్, వైసీపీ-కేతిరెడ్డి పోటీ చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో కూటమి-సురేంద్రబాబు, వైసీపీ- రంగయ్య పోటీలో ఉన్నారు.
Similar News
News January 26, 2025
రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధం
జనవరి 26న పురస్కరించుకొని రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధమైంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని జాతీయ పతాకం లోని కాషాయపు రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. విద్యుత్ దీపాలు సుందరంగా అలంకరించడంతో కలెక్టర్ కార్యాలయం ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం జాతీయ జెండా త్రివర్ణ పతాకాలు ఎగరనున్నాయి.
News January 25, 2025
అనంతపురం జిల్లా వాసికి ‘పద్మశ్రీ’
కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా ఏపీ నుంచి ఐదుగురికి వరించాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడగుల నాగఫణిశర్మ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్ట్ విభాగంలో నాగఫణిశర్మకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.
News January 25, 2025
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం వరించడంపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 1960లో జన్మించిన బాలయ్య 14ఏళ్ల వయసులోనే తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. సినీరంగంలో రాణిస్తూ 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ గెలుపు సాధించారు. బసవతారకం ఆసుపత్రితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.