News March 20, 2024
మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతి
మంత్రాలయం మండలం మాధవరం సమీపంలోని మారుతి ఇస్పాత్ ఫ్యాక్టరీలో ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ కు చెందిన గంగా(22) ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇనుప ఖనిజం ముద్ద పడి మృతిచెందినట్లు తెలిపారు. 3 రోజుల క్రితం ఫ్యాక్టరీలో పని చేసేందుకు 13 మంది కూలీలను కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో వేస్టేజ్‌ను తొలగించే క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
Similar News
News September 15, 2024
గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు తీసుకోండి- ఎస్పీ
వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఘాట్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక ప్రతిమల ఊరేగింపు మొదలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకు, ఉత్సవ కమిటీలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News September 15, 2024
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ
కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఈనెల 16న(సోమవారం) నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు కర్నూలుకు రావద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.
News September 14, 2024
ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ
కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.