News March 23, 2025
మారుమూల ప్రాంతాలకు తాగునీటిని అందించాలి: ASF కలెక్టర్

మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ జరుగుతున్న నీటి సరఫరా ప్రక్రియను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మిషన్ భగీరథ ఇంజినీర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 5, 2025
యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం: కలెక్టర్

యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణవకాశమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని ఎంపీ సూచించారు.
News November 5, 2025
గోదావరిఖని: పీజీ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు

గోదావరిఖని ప్రభుత్వ పీజీ కళాశాల ఎంబీఏ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో విద్యార్థినులు దూడెం తరుణ, మునిగంటి మౌనిక, దేవులపల్లి ఉషశ్రీ, పున్నం కళ్యాణి, కందూరి కళ్యాణి, చిట్టవేణి సాగరిక ఉన్నారు. ఈనెల 7న శాతవాహన యూనివర్సిటీ నిర్వహించే ద్వితీయ స్నాతకోత్సవ వేడుకల్లో వీరు బంగారు పతకాలను అందుకోనున్నారు.
News November 5, 2025
ANU దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బిబిఎం, బిహెచ్ఎం, బిబిఏ, ఇయర్ ఎండ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషల్ వర్క్, మొదటి, ద్వితీయ, తృతీయ సెమిస్టర్, తదితర ఫలితాలను విడుదల చేశారు.


