News March 30, 2025

మారు తల్లి కొట్టడంతో బాలుడి మృతి, మరో బాలుడికి గాయాలు  

image

పల్నాడు జిల్లా ఎడ్లపాడు(మ) కొండవీడు వద్ద గొల్లపాలెంలో కవల పిల్లల్ని మారు తల్లి కొట్టడంతో చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. కొండవీడుకి చెందిన కంచర్ల సాగర్, లక్ష్మి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. సాగర్ మొదటి భార్యకి ఇద్దరు కవలలు పుట్టగా, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. రెండడో భార్య లక్ష్మి మొదటి భార్య పిల్లలను.. ఓ బాబుని గోడకేసి కొట్టడం వల్ల తల పగిలి అక్కడకక్కడే చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.  

Similar News

News November 24, 2025

చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

image

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు?(1/2)

image

విశాఖలోని సింహాచలం దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. బోర్డులో మొత్తం 20కి పైగా సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని వారినే బోర్డులోకి తీసుకునే వారు. అయితే ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వారిని కూడా బోర్డులో తీసుకునే అవకాశాలున్నాయి.

News November 24, 2025

త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ?(2/2)

image

సింహాచలం దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తను ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా పూసపాటి వంశస్థులనే నియమిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. గవర్నర్‌గా చేసే వారు ఇతర స్థానాల్లో కీలక బాధ్యతల్లో ఉండరాదనే నిబంధనలు వల్ల ఆయన చైర్మన్‌గా కొనసాగడంపై తర్జనబర్జనలు జరిగాయి. కొత్త బోర్డు నియామకాం ద్వారా ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.