News November 21, 2024

మారేడుమిల్లి: జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని పలు రాజకీయ విషయాలను గూరించి చర్చించామని ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉండమని జగన్ సూచించారని ఎమ్మెల్సీ తెలిపారు. అడ్డతీగల జడ్పీటీసీ వీర్రాజు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై పోరాడాలని సూచించారన్నారు.

Similar News

News July 10, 2025

రాజమండ్రి: ఆత్మహత్యకు పాల్పడి వ్యక్తి మృతి

image

రాజమహేంద్రవరం ఓల్డ్ రైల్వే క్వార్టర్ సమీపంలో మెట్ల కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం పోలీసులు గుర్తించారు. గత నెల 23న ఇంట్లో బైక్, సెల్‌ఫోన్ వదిలి వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. రైల్వే క్వార్టర్ శివాలయం సమీపంలో అతని మృతదేహం లభించింది. ఆత్మహత్య కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2025

చాగల్లు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

చాగల్లుకు చెందిన (59) శ్రీరంగం కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బుధవారం తెల్లవారుజామున రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం రాత్రి చాగల్లులో కృష్ణారావు మోపెడ్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎస్ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు.

News July 10, 2025

‘కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయి’

image

మహారాష్ట్రకు చెందిన కేంద్ర రైల్వే మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత శ్రీరామ్ సాహెబ్ దాన్వే బుధవారం కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్య దేవ నర్సరీని సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సరీకి విచ్చేసి పలు రకాల మొక్కలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.