News March 1, 2025
మారేడుమిల్లి: పింఛన్లు పంపిణీలో ప్రథమం

అల్లూరి జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీలో మారేడుమిల్లి మండలం 95.61 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని MPDO విశ్వనాధ్ శనివారం తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంను ఆయన పర్యవేక్షించారు.1935 మందికి పింఛన్లు మంజూరు కాగా 1850 మందికి ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. గత 5నెలలుగా ఈ మండలమే ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 21, 2025
రేపటి నుంచి వారి ఖాతాల్లో నగదు జమ

AP: విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు రేపటి నుంచి పరిహారం అందజేయనున్నట్లు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన ₹17 లక్షల ధరను ప్రభుత్వం ₹20 లక్షలకు పెంచిందని చెప్పారు. రైతుల భూములకు ఎక్కువ ధర ఇస్తామని తప్పుదోవ పట్టిస్తున్న దళారులపై ప్రభుత్వం సీరియస్గా ఉందని హెచ్చరించారు.
News November 21, 2025
వేములవాడ: భీమన్న ఆలయంలో కార్తీక దీపోత్సవం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో చివరిరోజు రాత్రి 30వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు, సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.
News November 21, 2025
గోదావరిఖని నుంచి కర్ణాటక యాత్ర దర్శన్

గోదావరిఖని డిపో భక్తుల కోసం కర్ణాటక యాత్ర దర్శన్ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. DEC 6 మధ్యహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి 11న తిరిగి ఇక్కడకు చేరుకుంటుంది. ఈ యాత్రలో హంపి, గోకర్ణ, మురుడేశ్వర, ఉడిపి, శృంగేరి, ధర్మస్థలి, కుక్కి సుబ్రమణ్యస్వామి, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఒక్కరికి ఛార్జ్ రూ.6,600. వివరాలకు 7013504982 నంబరును సంప్రదించవచ్చు.


