News March 1, 2025
మారేడుమిల్లి: పింఛన్లు పంపిణీలో ప్రథమం

అల్లూరి జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీలో మారేడుమిల్లి మండలం 95.61 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని MPDO విశ్వనాధ్ శనివారం తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంను ఆయన పర్యవేక్షించారు.1935 మందికి పింఛన్లు మంజూరు కాగా 1850 మందికి ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. గత 5నెలలుగా ఈ మండలమే ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 24, 2025
నస్రుల్లాబాద్: చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన కీసరి రాములు(37) ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 24, 2025
లక్ష్మణచాంద: రైతు ఆత్మహత్యాయత్నం

భూ సమస్య పరిష్కారం కాక లక్ష్మణచాంద మండలంలోని పొట్టపెల్లి గ్రామానికి చెందిన రైతు తోడిశెట్టి భూమన్న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భూమన్న పొట్టపెల్లి గ్రామాన్ని ఆనుకుని ఉన్న భూమిని కొన్నారు. కానీ పొట్టపెల్లి గ్రామ భూమిని సాగుచేస్తున్నారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. హద్దులు తేల్చాల్సిన సర్వేయర్లు ఏళ్లయినా నిర్ణయించకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు.
News March 24, 2025
ఏలూరు: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.56 లక్షల మంది ఇంకా EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.