News August 10, 2024

మార్కాపురంలో మూడు రంగుల అరుదైన పక్షి

image

మార్కాపురం పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని చెట్టుపై శుక్రవారం మునియా పక్షి దర్శనమిచ్చింది. మూడు రంగులలో పక్షి ఉండటంతో దీనిని త్రివర్ణ మునియా అంటారని అటవీశాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు. కనిపించకుండా పోతున్న జాతుల్లో త్రివర్ణ మునియా జాతి ఒకటని అన్నారు. కళాశాల ప్రాంగణంలో చెట్లపై ఈ పక్షిని గమనించిన విద్యార్థులు వింతగా చూశారు.

Similar News

News September 21, 2024

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?

image

బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?

image

ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

News September 20, 2024

CM సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి స్వామి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.