News March 8, 2025

మార్కాపురంలో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన SP

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు నేడు మార్కాపురం రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, SSG ఆఫీసర్స్ కలిసి మార్కాపురంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌ తనిఖీలను శుక్రవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వివరించారు.

Similar News

News February 23, 2026

ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

image

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.