News January 28, 2025
మార్కాపురంలో స్థలాలు మరింత ప్రియం

ప్రకాశం జిల్లాలో భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడమే దీనికి ప్రధానం కారణం. గవర్నమెంట్ లెక్కల ప్రకారం కంటే ఎక్కువ ధరకు భూములు విక్రయిస్తున్న చోటే రిజిస్ట్రేషన్ విలువ పెంచనున్నారు. ఈ లెక్కన మార్కాపురంలోని స్థలాలు ప్రభుత్వ బుక్ ధర కంటే ఎక్కువ పలుకుతున్నాయి. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్కాపురంలో రిజిస్ట్రేషన్ ధరతో పాటు భూమి విలువ పెరుగుతుంది.
Similar News
News February 19, 2025
ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉండాలి: ఎస్పీ

ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రకాశం ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బుధవారం ఒంగోలులోని పోలీస్ కళ్యాణమండపంలో మహిళా పోలీసులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత మనందరి బాధ్యత కావాలన్నారు. మహిళా ఫిర్యాదులు, పాటించవలసిన నియమాలపై మహిళా పోలీసులకు ఎస్పీ అవగాహన కల్పించారు.
News February 19, 2025
మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.
News February 19, 2025
జగన్ నాసిరకం మద్యం అమ్మించాడు: మంత్రి స్వామి

జగన్ జే ట్యాక్స్ కోసం నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీశాడని మంత్రి స్వామి అన్నారు. నాటు సారా నిర్మూలనపై బుధవారం ఒంగోలులో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, మద్యం విచ్చలవిడిగా విక్రయించారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ దోరేకవన్నారు. కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థని తెచ్చామన్నారు.