News August 18, 2024
మార్కాపురం: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మార్కాపురం పట్టణానికి చెందిన కరాటే స్కూల్ విద్యార్థులు చెన్నైలో జరిగిన కరాటే పోటీల్లో సత్తా చాటారు. చెన్నై మౌంట్ ఫోర్ట్ లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 3 జోన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మార్కాపురానికి చెందిన విద్యార్థులు రెండు గోల్డ్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కె.మహితా రెడ్డి, భార్గవ్‌లు గోల్డ్ మెడల్స్ సాధించారు.
Similar News
News September 17, 2024
ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్
తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.
News September 17, 2024
బాలినేని దారెటు?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక ఓటమి తర్వాత ఒంగోలులో రీ వెరిఫికేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద చర్చే జరిగింది. దీంతో ఆయన దారెటు అంటూ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
News September 17, 2024
ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.