News October 9, 2024

మార్కాపురం జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News July 8, 2025

ప్రకాశం: ఆ ప్రాంతంలో నిలిచిన మొహర్రం

image

ప్రకాశం జిల్లా తుమ్మలచెరువులో 2 రోజులుగా కొనసాగుతున్న మొహర్రం అనుకోకుండా నిలిచిపోయింది. దర్గా ప్రధాన ముజావర్ ఖైదా పీర్ల ఊరేగింపు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కార్యక్రమం నిలిచిపోయింది. 2 రోజుల తర్వాత వీధుల్లో పీర్ల ఊరేగింపు మళ్లీ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. కాగా జులై 2న <<16912097>>మృతుడు Way2Newsతో<<>> ఆ గ్రామ పీర్ల గొప్పదనాన్ని వివరించిన విషయం తెలిసిందే.

News July 8, 2025

ప్రకాశం: అద్దెకు ఇళ్లు.. చివరికి బెదిరింపులు

image

తన ఇంట్లో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని బెదిరిస్తున్న వైనంపై సదరు బాధితురాలు సోమవారం SP దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఓ మహిళకు ఒంగోలులో నివాసం ఉంది. ఆ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు. వారు అద్దె డబ్బులు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు సదరు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News July 8, 2025

ఒంగోలు: ‘త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.