News April 12, 2025
మార్కాపురం తహశీల్దార్‌కి ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.
Similar News
News January 11, 2026
ప్రకాశం: హైవేపై ప్రమాదం.. ఒకరు దుర్మరణం

లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాచర్ల మండలం ఎడవల్లి గ్రామం వద్ద అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గిద్దలూరు వైద్యశాలకు తరలించగా ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 10, 2026
ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 10, 2026
ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


